ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు ప్రోగ్రెస్ రిపోర్టులు! 17 d ago
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధుల సమగ్ర పరిశీలనకు ప్రభుత్వం హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను తీసుకొచ్చింది. ఇంతకు ముందు వరకు కేవలం మార్కులతోనే కార్డులు ఇస్తుండగా ఇకపై విద్యార్ధికి సంబంధించిన సమగ్ర వివరాలతో హోలిస్టిక్ కార్డులు ఇవ్వనుంది. ఈ కార్డులను తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం రోజున రాష్ట్రవ్యాప్తంగా వీటిని తల్లిదండ్రులకు ఇవ్వనున్నారు.విద్యార్ధిలో భావవ్యక్తీకరణ, పరస్పర సహకారం, నాయకత్వ నైపుణ్యాలు ఎలా ఉన్నాయో గుర్తించి, ప్రారంభ, నైపుణ్య, ప్రగతిశీల అని మూడు స్ధాయిలుగా విభజించి, విద్యార్ధి ఏ స్థాయిలో ఉన్నారో కార్డులో పేర్కొంటారు.సాధారణ అంశాలు, పర్యావరణ అవగాహన,తార్కిక ఆలోచన,ఎన్‌సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్‌ల్లో విద్యార్ధి స్థాయిని పేర్కొంటారు.నైపుణ్యం కలిగిన కళారూపంతో పాటు వీటిపై ఉపాధ్యాయుని సూచనలు అందిస్తారు. మార్కులకు సంబంధించిన గ్రేడ్లు కూడా ఇస్తారు. సహా పాఠ్యాంశాలకు ఇచ్చిన మార్కులను వివరంగా పేర్కొంటారు. కళలు-సాంస్కృతిక విద్య, విలువలు-జీవన నైపుణ్యాలు, కంప్యూటర్- వృత్తి విద్య, క్రీడలు, యోగాలో విద్యార్ధి ప్రతిభకు మార్కులు ఇస్తారు.